HYD: గ్రేటర్ నగరంలో కుక్కకాటు కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గత 20 రోజుల్లో సుమారుగా 200 మందికి పైగా బాధితులు ఫీవర్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్న రికార్డులు చూస్తేనే ఇది అర్థమవుతుంది. గత రెండు సంవత్సరాల్లో బర్త్ కంట్రోల్ చర్యలకు రూ.30 కోట్లు ఖర్చు చేసినా అంతగా ఫలితం కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు.