WGL: సంగెం మండలం గవిచర్ల-కుంటపల్లి గ్రామాలకు వెళ్లే మార్గంలోని విద్యుత్ స్తంభానికి చెట్ల తీగలు అల్లుకుని ప్రమాదకరంగా మారాయి. ఈదురు గాలుల కారణంగా కరెంటుకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చెట్ల తడివల్ల పాడి పశువులు, స్థానికులు షాక్కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.