KDP: పులివెందులలోని నగిరి గుట్టలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టిడిపి ఇంఛార్జ్ మారేటి రవీంద్రారెడ్డి గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. సూపర్ – 6లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ఉచిత గ్యాస్, తల్లికి వందనం అమలు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ నగదును రైతులు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.