HYD: గ్రేటర్ నగరంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికి 500లకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. తీవ్రంగా కడుపునొప్పి, వాంతులు, శరీర భాగాల నుంచి రక్తస్రావం, బీపీ తగ్గటం, కాళ్లు చేతులు చల్లబడటం, కాళ్ళ వాపుతో పాటు కాళ్ల కింద వాపు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని OUMC ప్రిన్సిపాల్ రాజారావు సూచించారు.