KKD: కులాల మధ్య చిచ్చుపెట్టే వర్గీకరణ ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విరమించుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా. ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. మంగళవారం కాకినాడలోని శాంతిభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 1935లో నాటి రాజ్యాంగం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వమే ఈ ఎస్సీ, ఎస్టీ గ్రూపులను విభజించ కూడదని పేర్కొందని గుర్తు చేశారు.