GNTR: మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలనే ఉపయోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మట్టి విగ్రహాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద కమిషనర్ మట్టి విగ్రహాలు, సంచులను పంపిణీ చేశారు.