సత్యసాయి: మడకశిరలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొంటాయని అన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, డిగ్రీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. నియోజకవర్గ యువతి, యువకులు మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని సూచించారు.