తెలంగాణలో (Telangana) చోటుచేసుకుంటున్న వరుస ప్రశ్నాపత్రాల లీక్ (Question Papers Leak) విషయాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అస్త్రం ఉందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున సంజయ్ ను పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేశారు. భువనగిరి జిల్లాలోని (Yadadri Bhuvanagiri District) బొమ్మలరామారం (Bommalaramaram) పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంజయ్ అరెస్ట్ తో తెలంగాణలో బీజేపీ నాయకులు భగ్గుమన్నారు. ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు కాషాయ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఆందోళనలో పాల్గొనడానికి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (Eatala Rajender), రఘునందన్ రావు (Raghunandan Rao), రాజా సింగ్ (Raja Singh)లను అదుపులోకి తీసుకున్నారు. కమలం పార్టీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారనే వార్తల నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అరెస్ట్ లు చేస్తున్నారు.
కాగా సంజయ్ అరెస్ట్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఆరా తీశారు. పార్టీ నాయకులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. అరెస్ట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ డీజీపీ (DGP) అంజనీ కుమార్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సంజయ్ అరెస్ట్ ను ఆ పార్టీ నాయకులు డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. కాగా బీజేపీ దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిప్పికొట్టారు. ప్రశ్నాపత్రాల కేసులో బీజేపీ నాయకుల అస్త్రం ఉందని తెలిపారు. బట్టకాల్చి మీద పడేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు రాబోతుండడంతో రాష్ట్రంలో విధ్వంసం.. అలజడి రేపేందుకు బీజేపీ లీకుల వ్యవహారం చేస్తోందని పేర్కొన్నారు.
సంజయ్ అరెస్ట్ పై బీజేపీ న్యాయ విభాగం స్పందించింది. సంజయ్ అరెస్ట్ పై హైకోర్టులో (HighCourt) హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. అయితే సంజయ్ ను కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్లడంతో దానికి అనుగుణంగా న్యాయస్థానంలో మరో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. జరిగే పరిణామాలపై ఢిల్లీ నుంచి ఆదేశాలకు అనుగుణంగా బీజేపీ కార్యాచరణ చేపడుతోంది. కాగా ఢిల్లీ నాయకత్వం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నది.
కాగా ప్రశ్నాపత్రాల లీకుల అంశంలో బీజేపీ నాయకుల పాత్ర కనిపిస్తోంది. లీకులకు పాల్పడుతున్న నిందితుల్లో అధిక మంది బీజేపీ నాయకులే ఉంటున్నారు. ఆ నిందితులంతా బీజేపీ నాయకులతో చనువుగా ఉన్న ఫొటోలు కలకలం రేపుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై అభాండాలు మోపి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీనే లీకులకు పాల్పడుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై సంజయ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది.
చదవండి:
మఫ్టీలో ఉంటూ మెడపై చేయి లాగుతూ దురుసుగా ప్రవర్తిస్తారా? అంటూ @RaghunandanraoM తీవ్ర ఆగ్రహం
అరెస్ట్ ప్రొసీజర్ ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్న రఘునందన్@bandisanjay_bjp అరెస్ట్ విషయంలో డీసీపీని కలిసేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపాటు pic.twitter.com/ysvjAWvfv2