»Due To The Cancellation Of Group 2 Examination Pravlika Committed Suicide In This Context Etala Rajender Strongly Condemned The Attack By Bjps Sakhnai Poles And Warned Kcr
Eatala rajender: ప్రవల్లిక మృతికి కేసీఆర్ బాధ్యత వహించాలి
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌పై పోలీసుల దాడిని ఖండిస్తూ.. ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు.
Etela Rajender: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడంతో..అక్కడికి వెళ్లిన బీజేపీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో ఈ దాడిని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడానికి కారణం గ్రూప్-2 పరీక్షలు రద్దు కావడమే. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలి. దీనికి కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈటల హెచ్చరించారు. ఎంతోమంది విద్యార్థులు వారి చదువు, ఉద్యోగం విషయంలో మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి వాళ్లు కుంగిపోకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచడం బీజేపీ బాధ్యత. దీనిలో భాగంగా వాళ్ల వద్దకు వెళ్లిన వారిపై లాఠీ ఛార్జ్ చేయడం కరెక్ట్ కాదని ఈటల అన్నారు.
బీజేపీ సీనియర్ నాయకులు, ఎంపీ శ్రీ @drlaxmanbjp గారు, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ @Bhanu4Bjp గారిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పరీక్షలు రద్దు అయ్యి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి పూర్తి భాద్యత కేసీఆర్ వహించాలి. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు. దీనికి తగిన… pic.twitter.com/7KNLzUOtgH
ఈ సందర్భంగా సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదని ఈటల అన్నారు. సమస్యలు వస్తూ పోతుంటాయి. వీటి గురించి ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడుపుకోత మిగల్చవద్దని విద్యార్థులకు సూచించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే బాధ్యత తీసుకుంటామని ఈటల పేర్కొన్నారు. వరంగల్ జిల్లా విద్యార్థి ప్రవళ్లిక హైదరాబాద్‌లోని అశోక్ నగర్లో ఉంటూ గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతుంది. గ్రూప్స్ పరీక్షలు రద్దు అయ్యాయని ఉంటున్న హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రూప్స్ అభ్యర్థులు, ఇతర పార్టీ నాయకులు అశోక్ నగర్ చేరుకున్నారు. విద్యార్థి మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, అభ్యర్థులకు మధ్య తోపులాట జరిగింది. వీరిని పంపించేందుకు పోలీసులు వీరిని లాఠీ ఛార్జ్ చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.