»Vijayashanthi Comments On Own Bjp Party Leaders Will The Party Change
Vijayashanthi: సొంత పార్టీ నేతలపైనే విజయశాంతి కామెంట్స్..పార్టీ మారుతారా?
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో ఉన్న కీలక నేత విజయశాంతి తాను ఉన్న పార్టీలోని నేతలపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ కామెంట్స్ ఎంటనేది ఇప్పుడు చుద్దాం.
Vijayashanthi comments on own bjp party leaders Will the party change
తెలంగాణ బీజేపీలో పలువురి నేతల అసంతృప్తుల పర్వం క్రమంగా వెలుగులోకి వస్తుంది. గతంలో ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ మధ్య కొనసాగిన వైరం ఇప్పటికే చుశాం. ఆ తర్వాత అధ్యక్షుడి మార్పుతో వివాదం కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈటల రాజేందర్, విజయశాంతి మధ్య విభేదాలు పెరిగాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో విజయశాంతి(Vijayashanthi) ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్విట్ గురించి చర్చనీయాంశంగా మారింది.
రాజకీయాలలో ఒక పార్టీలో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య పంథాలో ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా గౌరవించటం నాటి వాజ్పేయి జీ, పీవీ నరసింహారావు గారి నుంచి నేటి వరకు కొనసాగుతున్నది. రాజ్యసభ సభ్యులుగా గులాం నబీ ఆజాద్ గారి విరమణ సందర్భంగా… మోడీ గారు కూడా ఆ విధానాన్ని ఆ గౌరవాన్ని పార్టీలకు అతీతంగా కొనసాగించిన సంస్కారం ఆ పెద్దలు మాకు నేర్పిన సంస్కృతి అని పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా(sonia gandhi) గారిపై రాజకీయాలకు అతీతంగా నా ప్రకటన కూడా ఆ సంస్కారం నేర్పిన విధానమేనని తెలిపారు. ఆ ప్రకటన పై కూడా విమర్శలు మీడియాలో చేయించేవాళ్లు ఎప్పుడు ఉంటారు. వారికి సమాధానం చెప్పాల్సిన అంత అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ట్విట్ కు ముందు విజయశాంతి సోనియా గాంధీ అంటే గౌరవం, అభిమానం అని పేర్కొన్నారు. దీంతో రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ట్వీట్ చేశారు.
అయితే ఈ ట్వీట్ పరోక్షంగా ఈటల రాజేందర్(eatala rajender)కు చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పార్టీకి ఏది ముఖ్యమే ఆ అంశాలను పార్టీ కీలక నేతలకు తాను స్పష్టం చేసినట్లు చెప్పారు. పార్టీ గురించి లీకేజీల పేరుతో బయయటకు చెప్పడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు బీజేపీలో పలువురు నేతలు పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన పుకార్లను ఖండించారు.