Yuvagalam Padayatra : రాజ్యాంగం పవరేంటో చూపిస్తా : లోకేశ్
నీవు రాజారెడ్డి (Raja Reddy) రాజ్యాంగం పవర్ ఏమిటో చూపించావ్. నేను అంబేడ్కర్ (Ambedkar) రాజ్యాంగం దమ్మేమిటో చూపిస్తా’ అని సీ ఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) నిప్పులు చెరిగారు. యువగళం (Yuvagalam) పాదయాత్ర 60వ రోజు రాప్తాడు (Raptadu) నియోజకవర్గంలోని పంగళ్ రోడ్డు నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గం బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ వరకు 13.08 కి.మీ. సాగింది.
నీవు రాజారెడ్డి (Raja Reddy) రాజ్యాంగం పవర్ ఏమిటో చూపించావ్. నేను అంబేడ్కర్ (Ambedkar) రాజ్యాంగం దమ్మేమిటో చూపిస్తా’ అని సీ ఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) నిప్పులు చెరిగారు. యువగళం (Yuvagalam) పాదయాత్ర 60వ రోజు రాప్తాడు (Raptadu) నియోజకవర్గంలోని పంగళ్ రోడ్డు నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గం బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ వరకు 13.08 కి.మీ. సాగింది. మొత్తం పాదయాత్ర 773.09 కి.మీ.కు చేరింది. టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ అనంతపురంలో చేపట్టిన యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలతో స్వాగతం పలకడంతో అనంతపురం జనసంద్రంగా మారింది. అనంతపురంలో ఆరుగంటలపాటు పాదయాత్ర కొనసాగింది. దారిపొడవునా విచిత్ర వేషధారణలు, డప్పుల శబ్ధాలు, బాణసంచా మోతలతో పాదయాత్ర (Padayatra)హోరెత్తింది. ఈ సందర్భంగా అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలను పురుగుల్లా చూశాడు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించాడు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యిందని లోకేశ్ విమర్మించారు. ఎన్నికల్లో సింగిల్‌గా రండని ప్రతిపక్షాలను అడుక్కునే దుస్థితికి వచ్చాడు. అయ్యా మీ సీట్లు మీకే, నన్ను ఒంటరిని చేసి పోవద్దు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలను బతిమాలుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది ట్రైలర్ (Trailer) మాత్రమే, అసలు సినిమా రాబోయే రోజుల్లో చూపిస్తా’ అని లోకేశ్ హెచ్చరించారు. ఎన్నికల ముందు నేల సీఎం జగన్ (CM Jagan) పాదయాత్ర చేసి ముద్దులు పెట్టాడని, ఎన్నికల తర్వాత గాలి జగన్‌గా మారి విమానాల్లో తిరుగుతూ పేద ప్రజలను హింసిస్తున్నాడని ధ్వజమెత్తారు. గాలి జగన్‌కు రెండు బటన్లున్నాయని, బ్లూ బటన్ నొక్కగానే మీ ఖాతాల్లో రూ.10 పడతాయని, బల్లకిందున్న రెడ్ బటన్ (Red button) నొక్కితే మీ ఖాతాల్లోని రూ.100 పోతాయని లోకేశ్ సెటైర్లు వేశారు.
వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు విద్యుత్ చార్జీలు, 3 సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి బాదుడే బాదుడుకు శ్రీకారం చుట్టారన్నారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్(Petrol), డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపారని ఆయన విమర్శించారు. ‘త్వరలోనే వలంటీర్ మీ ఇంటికొస్తాడు. ఓ మిషన్ తీసుకొచ్చి గాలి ఊదమంటాడు. పొరపాటున మీరు గాలి ఊదితే. ఎంత గాలి పీల్చారో లెక్కగట్టి గాలిపై పన్ను వేసేందుకూ సీఎం జగన్ వెనుకాడడు’ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి (MLA Ananta Venkatarami Reddy) తన జేబు నింపుకోవడం కోసం రోడ్డు కాంట్రాక్టర్ నుంచి 10 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారని ఆయన ఆరోపించారు.