సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. KGF సినిమాలో బాంబే డాన్ ‘శెట్టి’ పాత్రలో నటించిన దినేశ్ మంగళూరు కన్నుమూశారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ఆయన నటుడిగానే కాకుండా ‘వీర మదకరి’, ‘చంద్రముఖి ప్రాణసఖి’, ‘రాక్షస’ తదితర చిత్రాలతో ఆర్ట్ డైరెక్టర్‌గానూ గుర్తింపు పొందారు.