కొన్ని గేమ్స్ లలో పెద్ద ఎత్తున డబ్బులను పోగొట్టుకునే వారు ఉంటారు. కొన్ని రకాల గేమ్ లు ఆడటం కొందరికి వ్యసనం. ఈ వ్యసనం కారణంగా చేతిలోని డబ్బును (Money) అంతా పోగొట్టుకున్న వారిని గురించి విన్నాం లేదా చూశాం. కాని అప్పుడప్పుడు కొన్ని గేమ్ లలో లేదా లాటరీలలో తక్కువ మందికి లక్ష్మీ వరిస్తుంది. అలాంటిదే ఇది. ఓ సాధారణ డ్రైవర్ (Driver won online gaming) ఓ ఆన్ లైన్ గేమింగ్ యాప్ లో రూ.49 ఇన్వెస్ట్ (Investment) చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు (Man invests Rs 49 on online gaming app, wins Rs 1.5 crore overnigh). ఏకంగా రూ.1.5 కోట్లను గెలుచుకున్నాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ (Madhya Pradesh)లో జరిగింది. బర్వానీ జిల్లాకు చెందిన డ్రైవర్ షహబుద్దీన్ మన్సూరి ఆదివారం ఆన్ లైన్ గేమింగ్ యాప్ లో రూ.49 ఇన్వెస్ట్ చేశాడు. గేమింగ్ యాప్ లో రూ.49 కేటగిరీలో వర్చువల్ క్రికెట్ జట్టును (Cricket Team) సృష్టించడం ద్వారా అతను మొదటి స్థానాన్ని పొంది ఈ మొత్తాన్ని గెలుచుకున్నాడు.
ఇతనికి లక్ష్మీ కేవలం ఒక్కరోజులోనే వరించలేదు. రెండేళ్లుగా తాను ఇలాంటి ఆన్ లైన్ క్రికెట్ గేమ్ లలో జట్లను సృష్టించడం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. ఆదివారం కోల్ కతా వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా యాప్ లో ఊహాజనిత లేదా వర్చువల్ క్రికెట్ టీమ్ ను సృష్టించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా రూ.1.5 కోట్లు గెలిచాడు. అతను తన వ్యాలెట్ నుండి రూ.20 లక్షలు విత్ డ్రా చేసుకున్నాడు. ఆరు లక్షల రూపాయలు ట్యాక్స్ కింద కట్ అవుతాయి. రూ.14 లక్షలు బ్యాంకు అకౌంట్ కు ట్రాన్సుఫర్ అయ్యాయి. గెలిచిన మిగతా డబ్బుతో సొంత ఇల్లు కట్టుకోవాలని, అలాగే, సొంతగా బిజినెస్ ప్రారంభించాలని చూస్తున్నాడు షహబుద్దీన్.