తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లేదని నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. AAA థియేటర్ తప్పించి మరే థియేటర్ తనకు లేదన్నారు. 15లోపు థియేటర్లు మాత్రమే తన చేతిలో ఉన్నాయని.. తన దగ్గర చాలా థియేటర్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2 రోజుల నుంచి ఆ నలుగురు అంటూ వార్తలు రాస్తున్నారని అన్నారు. ఆ నలుగురిలో తాను లేనని.. ఆ నలుగురితో తనకు సంబంధం లేదని వెల్లడించారు.