గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమా నిడివిపై వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. సినిమా 3 గంటల పైగా ఉంటుందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉందని, కేవలం ఫస్టాఫ్ మాత్రమే ఎడిటింగ్ పూర్తయిందని తెలిపింది. ఏప్రిల్ 30న సినిమాను విడుదల చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని టీం క్లారిటీ ఇచ్చింది.