E.G: గోపాలపురం మండలం సాగిపాడు గ్రామ ప్రజలకు సంబంధించిన స్మశాన వాటికను తణుకు వేములయ్య అనే వ్యక్తి ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గోపాలపురం జనసేన ఇంఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు తెలిపారు. దీనిపై విచారణ జరిపి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని దేవరపల్లి సీఐ, ఎస్సై, తహసీల్దార్‌కు ఇవాళ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.