WGL: హెరిటేజ్ టూర్లో భాగంగా ఈ నెల 14న వరంగల్ ఖిలాకు ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్నారు. వారి భద్రత కోసం వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ శనివారం కోటను సందర్శించి, ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా సిబ్బంది నియామకం, సుందరీమణులు ప్రయాణించే మార్గంలో భద్రతా చర్యలపై పోలీసు, రెవిన్యూ అధికారులతో చర్చించారు.