SKLM: పోలాకి మండలం పిరియాగ్రహారంలో వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని మంగళవారం యువనేత, జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట ఎంపీపీ బైరాగి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ ఛైర్మన్ భాస్కరరావు ఉన్నారు.