ATP: పుట్లూరు మండలం కొండుగారికుంట గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయంలో భాగవత సప్తాహం కార్యక్రమం వైభవంగా ముగిసింది. మంగళవారం చివరి రోజు కావడంతో స్వామి వారికి అత్యంత భక్తిశ్రద్ధల నడుమ విశేష పూజలు నిర్వహించారు. మూడు రోజుల నుంచి సాగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పురాణ ప్రవచనాలను ఆలకించారు.