TG: రాజేంద్రనగర్ మానస హిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబానికి చెందిన ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’ అక్రమ క్వారీ నిర్వహిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఎటువంటి పర్యావరణ, మైనింగ్ అనుమతులు లేకుండా పగలు రాత్రి కొండలను పిండి చేస్తూ ప్రకృతికి, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ క్వారీని మూసివేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.