WNP: జిల్లాలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మఇళ్ల నిర్మాణంలో త్వరగా గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలుచేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నిర్మాణం పనులు ప్రారంభించని లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి.. ఇంటి నిర్మాణంపై ఆసక్తిలేని లబ్ధిదారులను గుర్తించాలన్నారు.