KRNL: అంతర్జాతీయ క్రీడాకారుడు రామాంజనేయులును ఆదుకోవాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. శారీరక వికలాంగుడైన రామాంజనేయులు 2015 నుంచి వివిధ రకాల క్రీడాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, రాణిస్తున్న ఆర్థిక ప్రోత్సాహంలేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే శనివారం తెలిపారు. ఇలాంటి క్రీడాకారులను దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.