SKLM: గార మండలం సతివాడ గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ మేరకు శ్రీకూర్మం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డా.డి. పద్మజ పలువురు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరంలో ఏఎన్ఎం అప్పమ్మ, 104 సిబ్బంది, ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.