ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో కీలక మావోయిస్టు మృతి చెందాడు. మృతుడు డివిజన్ కమిటీ సభ్యుడు ఐతు అలియాస్ యోగేష్ కోర్సాగా భద్రతా బలగాలు గుర్తించాయి. సెంట్రల్ కమిటీ మనోజ్ టీమ్ కమాండర్‌గా ఐతు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో SLR ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.