AP: పదేళ్ల క్రితం ఏం చెప్పి మోసం చేశారో.. అవే అబద్ధాలను ఇప్పుడు అందంగా చెప్పి ఆంధ్రులను ప్రధాని మోసం చేశారని కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ‘పునర్విభజన చట్టం ప్రకారం అమరావతి నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. విభజన చట్టంలో కేంద్రం విధులు స్పష్టంగా ఉన్నా.. ప్రధాని రాష్ట్రానికి ఇచ్చిందేమిటి? 2015లో మట్టి కొట్టారు. ఇప్పుడు సున్నం కొట్టి వెళ్లారు’ అని విమర్శలు చేశారు.