KRNL: పత్తికొండ సీపీఐ కార్యాలయంలో శనివారం ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎరుకల హనుమేశ్ ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ 66వ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర నేతలు భీమలింగప్ప జెండా ఆవిష్కరణ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. మే 15వ తేదీ తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ మహాసభలను జయప్రదం చేయాలన్నారు.