NTR: అమరావతి 2.0కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా జైత్రయాత్ర కదిలిందని శనివారం ఏపీ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. రూ.49,040 కోట్ల ప్రాజెక్టులకు వెలగపూడిలో ప్రారంభోత్సవాలు వైభవంగా జరిగాయని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు.