కృష్ణా: అవనిగడ్డలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. గ్రామంలోని గుర్రపు చెరువు వద్ద వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి విజయలక్ష్మి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.