NRML: జూన్ 3 నుంచి 13 వ వరకు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని డీఈఓ రామారావు తెలిపారు. మే నెల 16 లోపు పరీక్ష రుసుమును ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో సబ్జెక్టు పరీక్ష జరిగే ముందు 2 రోజుల వరకు చెల్లించవచ్చని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు