TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NDSA నివేదికను అధ్యయనం చేయడానికి ఐదుగురు ఇంజినీర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రాజెక్ట్ మరమ్మత్తులకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. నివేదికలో పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ సిఫార్సులు చేయనుంది.