SRD: కంగ్టి మండలంలోని ఎరువుల దుకాణ దారులతో MAO హరీష్ శనివారం రైతు వేదికలో సమావేశం నిర్వహించారు. రానున్న వానాకాలం సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువులు, అందుబాటులో ఉంచాలని సూచించారు. మార్కెట్లో నాసిరకమైన విత్తనాలు అమ్మితే వారి షాప్‌తో పాటు లైసెన్స్‌ను రద్దు చేసి, జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అనంతరం దుకాణ దారులు ఎంఏవోను సన్మానించారు.