SRD: జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాన్ని సదాశివపేట మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలరెడ్డి హాజరై మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని గుర్తు చేశారు.