కృష్ణా: ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల రెల్లీ కులస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగిన అంతర్ రాష్ట్రాల క్రికెట్ పోటీల్లో గుడివాడకు చెందిన రాజ్ సీసీ జట్టు సభ్యులు ప్రతిభ చూపి రన్నరప్‌గా నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన టీం సభ్యులను తన కార్యాలయంలో సీనియర్ వైసీపీ నేతలు మండలి హనుమంతరావు శనివారం అభినందించారు.