KDP: మైలవరం మండలంలో తొర్రివేముల కుంటకట్ట వీధిలో చెట్టుకు విద్యుత్ లైన్ తగిలించారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తారా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. 4 వారాల కిందట గాలి వానకి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. అధికారులకు తాత్కాలికంగా లైన్ను చెట్టుకు ఏర్పాటు చేశారు. కొత్త స్తంభాలు ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.