»South Central Railway Good News For Srivari Devotees
Vande Bharat Express : శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్
తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్ 8న ప్రారంభించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి తిరుపతికి వయా గుంటూరు మీదుగా ఈ రైలును నడపనున్నట్లు పేర్కొన్నారు.
తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్ 8న ప్రారంభించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి తిరుపతికి వయా గుంటూరు మీదుగా ఈ రైలును నడపనున్నట్లు పేర్కొన్నారు. అంటే సికింద్రాబాద్ నుంచి బీబీనగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకోనుంది. అయితే ఈ రైలు ఏయే స్టేషన్లలో ఆగనుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయిల్ రన్ పూర్తయింది. ఈ రైలు ప్రారంభమైతే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రస్తుతం 12 గంటలుగా ప్రయాణ సమయం ఆరున్నర గంటల నుంచి 7 గంటలకు తగ్గనుంది.
వందే భారత్ రైలు(Vande Bharat Train) 8.30 గంటల్లోనే గమ్యస్థానానికి చేర్చనున్నది. సికింద్రాబాద్ – తిరుపతి(Tirupati), తిరుపతి – సికింద్రాబాద్ మధ్య రైలు షెడ్యూల్‌ను అధికారులు అధికారికంగా ప్రకటించారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య కేవలం నాలుగు స్టేషన్లతో మాత్రమే రైలు ఆగనున్నది. 8న ప్రధాని మోదీ సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ (Secunderabad) – తిరుపతి వందేభారత్ వందేభారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ.2వేలు పైగా ఉండే అవకాశాలున్నాయి.ఏసీ చైర్ కారు రూ.1150గా ఉంటుందని సమాచారం. టికెట్ ధరలతో పాటు రైలు నెంబర్‌ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే సికింద్రాబాద్ – పూణే, కాచిగూడ – బెంగళూరు మధ్య సైతం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వేశాఖ(Department of Railways) కసరత్తు చేస్తున్నది.