సత్యసాయి: మడకశిర మండలం నీలకంఠాపురంలో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 18 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలతో నీలకంఠాపురంలోని ఆలయంలో ఈ వివాహాలను జరిపించారు. వధూవరులకు నూతన వస్త్రాలు, తాళిబొట్లు, కాలిమెట్టెలు అందజేసి భోజనం ఏర్పాటు చేశారు.