ముంబై స్టార్ పేసర్ బుమ్రా దాదాపు మూడు నెలల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. నేడు RCBతో జరగనున్న మ్యాచ్లో ఆడతాడని MI కోచ్ జయవర్ధనె ఇప్పటికే వెల్లడించాడు. ఈ క్రమంలోనే RCB ప్లేయర్ టిమ్ డేవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా వేసే తొలి బంతిని తమ ఓపెనర్లు ఫోర్ లేదా సిక్స్ కొడతారని తెలిపాడు. కాగా, టిమ్ డేవిడ్ గతేడాది MI తరఫున ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.