NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి ఆలయ అభివృద్ధికి ప్యాపిలి వాస్తవ్యులు తుమ్మనేని రాజశేఖర్ నాయుడు కుటుంబం రూ.50 వేల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు కుటుంబ సమేతంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, మాజీ చైర్మన్ పీవీ కుమార్ రెడ్డికి ఆదివారం విరాళాన్ని అందించారు. దర్శన ఏర్పాట్ల అనంతరం దాతలకు తీర్థప్రసాదాలు అందజేశారు.