PDPL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు.గత నెల 15వ తేదీ నుంచి పెద్దపల్లి జిల్లాలోని 15 ప్రాథమిక పాఠశాలల్లో 3,4, 5 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుపై శిక్షణ ఇస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందిస్తున్నామని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.