ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం అవోపా వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అవోపా ప్రెసిడెంట్ రాము మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజల సౌకర్యార్థం ఈ ఉచిత చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చలివేంద్రం మొదటి రోజు మజ్జిగను పంపిణీ చేశారు. ముందుగా అమ్మవారి చిత్రపటానికి పూజలు చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.