PDPL: రామగుండం కమిషనరేట్ షీటీం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ సహా ఇతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై వివరించారు. సమాజంలో మహిళల భద్రత, హక్కులపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా 1091 నంబర్లను సంప్రదించాలని సూచించారు.