TPT: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శుక్రవారం తిరుపతి గ్రామీణ మండలం దుర్గ సముద్రంలో రైతులకు రాయితీపై పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రాయితీపై ఎరువులు, పనిముట్లు పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు.