ADB: ఆంగ్లభాషపై విద్యార్థులు పట్టు సాధిస్తే మంచి భవిష్యత్తుకు ఉంటుందని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్త సూచించారు. మంగళవారం ఉట్నూరు పట్టణంలోని ఎమ్మార్పీ సమావేశ మందిరంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన యువ వక్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచేందుకు బోస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని పీఓ ప్రశంసించారు.