KDP: డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదామని బద్వేలు ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి సూచించారు. శుక్రవారం డీవైఎఫ్ఎ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణ పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు, మాదక ద్రవ్యాల వంటి జోలికి వెళ్ళవద్దని, వాటికి దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ నివారణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న డీవైఎఫ్ఎ సిబ్బందిని ఆయన అభినందించారు