JN: స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో వెంకన్న అఖిలపక్ష నాయకులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, అన్ని పార్టీల నాయకులు బిఎల్ఏలను నియమించుకొని ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు అందరికీ వారధిగా ఉంటూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, వివిధ పార్టీల నేతలు ఉన్నారు.