టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘మీరు ఎవరి పాత్రలో నటించాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి తమన్నా బదులిస్తూ.. శ్రీదేవి పాత్రలో తెరపై కనిపించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. తాను ఎప్పుడూ శ్రీదేవిని ఆరాధిస్తానని పేర్కొంది. అది తన కలల పాత్ర అని, ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.