అవతార్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2009లో వచ్చిన దర్శకుడు జేమ్స్ కేమరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా వచ్చి పుష్కర కాలం దాటిపోయినా.. ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే అప్పుడే అవతార్ సీక్వెల్స్ ప్రకటించాడు కామెరూన్. ప్రస్తుతం అవతార్ 2 రిలీజ్కు రెడీ అవుతోంది. ఆ తర్వాత రెండేళ్లకొక సీక్వెల్ రాబోతోంది. దాంతో అవతార్ 2(Avatar 2) పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇప్పటికే కామెరూన్ ఈ సినిమా పై అంచనాలు పెంచేసేలా కామెంట్స్ చేస్తున్నాడు. డిసెంబర్ 16న అవతార్ 2 రిలీజ్కు రెడీ అవుతోంది. దాంతో ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయిపోయిందట. ఇక ఇండియాలో అవతార్2 బిజినెస్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక్క తెలుగు నుంచే 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశిస్తున్నారట. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తప్పితే.. తెలుగు స్టార్ హీరోల సినిమాలు కూడా 100 కోట్ల బిజినెస్ జనగడం లేదు.
అలాంటిది ఒక హాలీవుడ్ మూవీకి ఇంత భారీ బిజినెస్ అంటున్నారంటే.. అవతార్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా వైడ్గా 600 కోట్ల టార్గెట్ అని టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే.. ఇండియన్ సినిమాలకు కూడా జరగని బిజినెస్ అవతార్ సీక్వెల్ సొంతం అని చెప్పొచ్చు. ఒక్క ఇండియన్ బాక్సాఫీస్ వద్దే కాదు.. వరల్డ్ వైడ్గా అవతార్2 బిజినెస్ ఊహించని రేంజ్లో జరగుతోందని సమాచారం. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.