»Ktr Comments On Bjp Modi Why Should That Perverted Bjp Party In Telangana
KTR: తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి.?
తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని మంత్రి కేటీఆర్(KTR) కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా అనేక అంశాలను ఇవ్వకుండా దాటేశారని గుర్తు చేశారు. అలాంటి క్రమంలో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వం..ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం అనే విధంగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్ వేదికగా KTR ఆరోపణలు చేశారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) కేంద్ర ప్రభుత్వం సహా ప్రధాని మోదీపై(PM Modi) సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను మోదీ ప్రభుత్వం దారుణంగా ఉల్లంఘించిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ రాదని చెప్పినప్పుడు.. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌కు రూ.20,000 కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. ఆ ఫ్యాక్టరీకి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 20, 2022న దాహోద్‌లో శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. మరోవైపు దాహోద్ యూనిట్ గుజరాత్‌లోని మొదటి, భారతదేశంలో నాల్గవ రైల్వే తయారీ కేంద్రమని స్పష్టం చేశారు.
4 Spineless BJP MPs from Telangana should be held accountable on Modi Govt’s outrageous flouting of AP Reorganisation Act promises
While Telangana is denied Coach Factory, PM’s home state Gujarat gets a ₹20,000 Crore locomotive coach factory!
కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం – ప్రధాని
పసుపు బోర్డు ఇవ్వం – ప్రధాని
మెట్రో రెండో దశ ఇవ్వం – ప్రధాని
ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం – ప్రధాని
గిరిజన యూనివర్సిటీ ఇవ్వం – ప్రధాని
బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం – ప్రధాని
ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం – ప్రధాని
ప్రధాని ప్రాధాన్యతల్లో..
అసలు తెలంగాణే లేనప్పుడు
తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి..?
తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
అయితే తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, టర్మరిక్ బోర్డు మంజూరు చేయబోమని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో తేల్చి చెప్పిన విషయాన్ని కేటీఆర్(KTR) ప్రస్తావించారు. ఈ అంశాలపై బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత బోర్లకుంట, కవితా మాలోతు, దయాకర్ పసునూరి, గడ్డం రంజిత్ రెడ్డి నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు అవరోధాలపై ప్రశ్నలు సంధించారు. స్పైసెస్ బోర్డ్ యాక్ట్, 1986 ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన స్వయంప్రతిపత్త సంస్థ అయిన స్పైసెస్ బోర్డు.. పసుపు, కొత్తిమీర, మిరపకాయలతో సహా 52 సుగంధ ద్రవ్యాలను ప్రోత్సహించే బాధ్యతను అప్పగించింది. ఆ క్రమంలో దేశంలో ఎలాంటి పసుపు బోర్డు లేదా ఇతర మసాలా బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదని లేదని కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ అన్నారు.