AP: మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు కుమారుడు సునీల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లిక్కర్ టెండర్ల స్కామ్ కేసు నుంచి తప్పించేందుకు లంచం ఇచ్చేందుకు యత్నించారని సిట్ ఐవో ఫిర్యాదు చేశారు. దీంతో 318(4), 61(2) సెక్షన్ల కింద సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.