NTR: గంపలగూడెం మండలం అనుముల లంకలో ఉన్న పౌల్ట్రీ ఫారంలో వేలకొద్ది కోళ్లు బర్డ్ ఫ్లూతో మృత్యువాత పడ్డ విషయం విధితమే. ఈ నేపథ్యంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు పర్యవేక్షణలో కోళ్ల శాంపిల్స్ తీసి పరీక్షా కేంద్రానికి పంపారు. రిజల్ట్ వచ్చేంతవరకు 10 కిలోమీటర్ల లోపల ఉన్న గ్రామాలలో చికెన్ షాపులు తెరవద్దని,రెడ్ అలర్ట్ ప్రకటించారు.